Kollywood : కయదు లోహర్ కోలీవుడ్ ఎంట్రీ

Kollywood : కయదు లోహర్ కోలీవుడ్ ఎంట్రీ
X

తెలుగులో శ్రీవిష్ణు జంటగా వచ్చిన 'అల్లూరి' మూవీలో నటించి ఆడియన్స్ ను మెప్పించిన బ్యూటీ కయదు లోహర్. ఇప్పటికే తెలుగు, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో తన అందచందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించింది ఈ బ్యూటీ. తాజాగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. తన ఫస్ట్ మూవీలోనే మంచి ఛాన్స్ కొట్టేసింది. తమిళ్ హీరో ప్రదీప్ రంగనాథ్ హీరోకు జంటగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. లవ్ టుడే ఫేం ప్రదీప్ రంగనాథన్ తాజాగా నటిస్తున్న మూవీ 'డ్రాగన్'. ఈ మూవీతో కయదు తమిళ ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ఇప్పటికే ఓ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వర్ ను సెలక్ట్ చేశారు. తాజాగా రెండో హీరోయిన్ గా కయదును ఎంపికచేశారు. ఏజీఎస్ నిర్మాణ సంస్థ నిర్మించే ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కావొచ్చింది. వచ్చే ఏడాది ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

Tags

Next Story