KCR on OTT : ఓటీటీలోకి కేసీఆర్.. ఆహాలో స్ట్రీమింగ్

రాకింగ్ రాకేశ్ హీరోగా గరుడ వేగ అంజి దర్శకత్వంలో వచ్చిన సినిమా కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్) ఈ సినిమా నవంబర్ నెల 22వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ నెల 28 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ము ఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన పరిణా మాలకు ఓ లంబాడీ యువకుడి జీవిత ప్రయాణాన్ని జోడించి ఈ మూవీని తెర కెక్కించారు. నటి సత్య కృష్ణన్ కూతురు అనన్య కృష్ణన్ ఈ చిత్రంతో హీరోయి న్గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కేసీఆర్' విషయానికొస్తే.. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న రోజుల్లో కేసీఆర్ ప్రసంగాలు విని అతడికి అభిమాని అవుతాడు కేశవ చంద్ర రమావత్ (రాకింగ్ రాకేష్). ఊరివాళ్లంతా కేశవ చంద్రరమావత్ను కేసీఆర్ అని పిలు స్తుంటారు. కేశవను అతడి మరదలు మంజు (అనన్యకృష్ణన్) ఇష్టపడుతుంది. బావనే పెళ్లిచేసుకోవాలని కలలు కంటుంది. మరదల్ని కాదని కేశవ చంద్ర రమావత్ బాగా డబ్బున్న అమ్మాయితో పెళ్లికి సిద్ధపడతాడు. తన పెళ్లి అభిమాన నాయకుడు కేసీఆర్ చేతుల మీదుగా జరగాలని కేశవ చంద్ర కలలు కంటాడు. కేసీ ఆర్ను కలవడం కోసం హైదరాబా ద్ వస్తాడు. ఆ తర్వాత ఏమైంది? కేశవ చంద్ర రమావత్.. కేసీఆ ర్ను కలిశాడా? తమ ఊరికి ఎదురైన రింగ్ రోడ్ సమస్యని ఇతడు ఎలా పరిష్కరించాడు? మరదలి ప్రేమను అర్థం చేసుకు న్నాడా అనేదే మూవీ స్టోరీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com