Keerthy Suresh : ఘనంగా కీర్తి సురేశ్ పెళ్లి.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడు అంటోనీతో ఏడడుగుల బంధంలోకి అడుగు పెట్టింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో ఆమె ప్రియుడు ఆంటోనీ కీర్తి మెడలో మూడుముళ్లు వేశాడు. గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్ లో వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. కొత్త జంటకు సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. వీళ్లిద్దరూ 15 ఏళ్ల నుంచి స్నేహితులు. ఇదే విషయాన్ని ఆంటోనీది వ్యాపార కుటుంబం. కొచ్చి, చెన్నైలలో వ్యాపారాలున్నాయి. స్కూల్ డేస్ నుంచి కీర్తితో ఆయనకు పరిచయం ఉంది. కాలేజీ రోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారింది . ‘రఘుతాత'తో ఇటీవల ప్రేక్షకులను అలరించారు నటి కీర్తిసురేశ్. ప్రస్తుతం ఆమె 'రివాల్వర్ రీటా', 'బేబీ జాన్' పనుల్లో బిజీగా ఉన్నారు. 'బేబీ జాన్'తో ఆమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈసినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com