లిప్ టు లిప్ కిస్‌కు కీర్తి సురేశ్ రెడీ!

సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య లిప్ లాక్ (LIP Lock) ఉంటే తప్ప డబ్బులు రావన్న భ్రమలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ ట్రెండ్ ఫాలో అవ్వడంతో.. తెరపైనే మూతులు మూతులు రుద్దుకునే సీన్ల తీవ్రత పెరిగిపోతూ వస్తోంది. తెరపై దీనికి దూరంగా ఉండాలనుకుంటున్న హీరోయిన్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఓకే చెబుతున్నారు. ఆఫర్లు లేని అనుపమ పరమేశ్వరన్ కూడా టిల్లుతో అదే పనిచేసింది. లిస్టులో క్రేజీ టాప్ హీరోయిన్లు కూడా చేరుతారని తెలుస్తోంది.
అనుపమ (Anupama) బాటలోనే కీర్తి సురేష్ (Keerthi Suresh) కూడా ప్రయాణించబోతోందని టాక్. కీర్తి సురేష్ కి ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. మహానటితో ఆమె జాతీయ అవార్డు కూడా సంపాదించింది. పద్ధతైన పాత్రలకు తను కేరాఫ్ అడ్రస్స్. అయితే కొంతకాలంగా ఆమెకు అవకాశాలు దక్కడం లేదు. మిగిలిన కథానాయికలతో పోటీ తట్టుకోలేకపోతోంది. మళ్లీ గాడిలో పడడానికి కీర్తి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఓ బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం.
బాలీవుడ్ సినిమా అంటే.. రెండో ఇన్నింగ్స్‌కు బలమైన పునాది పడినట్టే. అయితే సదరు సినిమాలో లిప్ లాక్ సన్నివేశం ఉందట. మొదట అలాంటి సన్నివేశాల్లో నటించడానికి నిరాకరించిన కీర్తి.. ఆ తరవాత ఒప్పుకోవాల్సివచ్చిందట. కీర్తిని ఇలాంటి సన్నివేశాల్లో చూడడం అభిమానులకు కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ తప్పడం లేదు. సీతారామం సినిమాలో అందరినీ అలరించిన మృణాల్ ఠాకూర్.. ఆ తర్వాత ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జనరేషన్ హీరోయిన్ల పోటీని తట్టుకోవాలంటే ఈ మాత్రం చేయాల్సిందే మరి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com