Keerthy Suresh : చిన్ననాటి మిత్రుడుతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్

సౌత్ స్టార్ బ్యూటీ కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీ తట్టిల్ తో ఏడడుగులు వేయబోతొందట. కొంత కాలంగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దుబాయ్ లో వ్యాపారవేత్త అయినా ఆంటోనీ చిన్నప్పుడు కీర్తి సురేష్ తో ఒకే పాఠశాలలో చదువుకున్నాడట. ఆ స్నేహం కాస్త కొంతకాలాని ప్రేమగా మారింది అని సమాచారం. అదే విషయాన్ని ఇద్దరు తమ ఇళ్లల్లో చెప్పగా పెద్దలు కూడా వెంటనే అంగీకరించారట. అలా దాదాపు 6 సంవత్సరాల కాలంగా కీర్తి. ఆంటోనీ రిలేషన్ లో ఉంటున్నారట. ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. డిసెంబర్ 11 లేదా 12 తెదీల్లో గోవా లో చాలా గ్రాండ్ వీరి పెళ్లి జరగబోతోందంట. ఈ పెళ్ళికి కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు టాక్. ఈ విషయంఫై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఆకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com