Keerthy Suresh : రివాల్వర్‌ రీటాగా కీర్తి సురేష్‌

Keerthy Suresh : రివాల్వర్‌ రీటాగా కీర్తి సురేష్‌
X

స్టార్ బ్యూటీ కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో వస్తున్న కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘రివాల్వర్‌ రీటా’. జేకే చంద్రు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జగదీష్‌ పళనిస్వామి నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తెలుగు హక్కులను నిర్మాత రాజేష్‌ దండా సొంతం చేసుకున్నారు. హాస్య మూవీస్‌ పతాకంపై తెలుగు రాష్ర్టాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు రాజేష్. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. దాంతో.. ఈ రీటా ఎవరు? తను పోలీసా? లేకా అండర్‌వరల్డ్‌ ఏజెంటా? అని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. మరి ఈ విషయాలన్ని తెలియాలాంటే ‘రివాల్వర్‌ రీటా’ సినిమా చూడాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్. మరి ఈ రీటా ఆడియన్స్ కు ఎలాంటి వినోదాన్ని పంచుతుందో చూడాలి.

Tags

Next Story