Keerthy Suresh : వెచ్చే నెలలో కీర్తి సురేష్ పెళ్లి
X
By - Manikanta |29 Nov 2024 6:30 PM IST
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకకుంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ "వచ్చే నెలలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ పెళ్లి గోవాలో జరుగబోతోంది" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి పేరు ఆంటోనీ తాటిల్. 15 ఏళ్లుగా ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారట. ఇటీవల పేరెంట్స్ తో చెప్పగా వారు కూడా ఒకే అన్నారట. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com