Keerthy Suresh : గ్లామర్ షోతో అదరగొట్టేసిన కీర్తి సురేశ్

Keerthy Suresh : గ్లామర్ షోతో అదరగొట్టేసిన కీర్తి సురేశ్
X

మహానటి ఫేం కీర్తి సురేశ్ బీ టౌన్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు ఇటీవలే బేజీజాన్ అనే సినిమా చేసింది. సినిమాలో కీర్తి సురేష్ ఎప్పుడు లేని విధంగా గ్లామర్ షోతో అదరగొట్టేసింది. సౌత్ లో స్కిన్ షోకు ప్రాధాన్యం ఇవ్వని ఈ భామ తన ధై షోతో టాక్ ఆఫ్ ద ఇం డస్ట్రీగా మారింది.ఈ సినిమా బాక్సఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. ఎలాగైనా బాలీవుడ్ లో చాన్సులు కొట్టేయాలన్న ఆలోచనతోనే ఈ అమ్మడు గ్లామర్ షోకు రైట్ రైట్ చెప్పే సిందనే టాక్ ఉంది. సాధారణంగా ఎవరైనా పెళ్లికి ముందు గ్లామర్ షో చేస్తారు. మ్యారేజ్ అయ్యాక తగ్గిస్తారు. కాస్తా విరామం ఇచ్చి సెకండ్ ఇన్నిం గ్స్ స్టార్ట్ చేసి కాస్తా పద్ధతిగా ఉంటారు కానీ ఈ బ్యూటీ మాత్రం స్కిన్ షోకు రెడీ అంటోంది. ఈ తికమక కాస్త కన్ ఫ్యూజ్ గానే ఉన్నా ఇదంతా కీర్తి సురేష్ ఒక ప్లాన్ ప్రకారమే చేస్తుందని తెలుస్తుంది. కీర్తి సురేష్ ప్లాన్ ప్రకారం పెళ్లయిన తర్వాత ఆఫర్లు కష్టంగా ఉంటాయి. ముఖ్యంగా గ్లామర్ షో చేయాల్సి వస్తుంది. అదే ముందుగానే గ్లామర్ షోకి రెడీ అనే హింట్ ఇస్తే అన్ని రకాల పాత్రలు వస్తాయన్న భావనతోనే అందాలు ఆరబోస్తోందనే టాక్ ఉంది. కీర్తి తమిళ్ లో రెండు సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి రివాల్వర్ రీటా కాగా మరోటి కన్నివేది. ఇవే కాదు బేబీ జాన్ లో అమ్మడి గ్లామర్ షో చూసిన బాలీవుడ్ మేకర్స్ కీర్తి సురేష్ కి ఆఫర్లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. అవి ఏ సినిమాలు అనే విషయంపైనే క్లారిటీ రావాల్సి ఉంది. బేబీ జాన్ అమ్మడికి అంత ఎంకరేజిం గ్ ఇవ్వకపోయినా బాలీవుడ్ నుంచి బాగానే అవకాశాలు అందుకుంటుందని టాక్. ఇక అమ్మడి తెలుగు సినిమాల విషయానికి వస్తే చిరంజీవి తో భోళా శంకర్ తో ఫ్లాప్ ఫేస్ చేసిన అమ్మడు మరో ఛాన్స్ అందు కోలేదు. ఐతే తెలుగులో ఎలాంటి ఆఫర్ వచ్చినా అమ్మడు రెడీ అనేస్తుంది.

Tags

Next Story