Kesari Chapter 2 : తెలుగులో కేసరి చాప్టర్ 2

Kesari Chapter 2 : తెలుగులో కేసరి చాప్టర్ 2
X

జలియన్ వాలాబాగ్ ఉదంతంపై బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'కేసరి చాప్టర్ 2' తెలుగులో రాబోతోంది. ఏప్రిల్ 18న బాలీవుడ్లో ఈ మూవీ రిలీజైంది. మే 23న టాలీవుడ్లో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అన్టిల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ అనే ట్యాగ్ లైనన్ను చేర్చారు. మాధవన్, అనన్యపాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ నిర్మించారు. అక్షయ్ కుమార్ నటించిన దేశభక్తి చిత్రాల్లో 'కేసరి' భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకి కొనసాగింపుగా 'కేసరి ఛాప్టర్ 2'ను మేకర్స్ రూపొందించారు. ప్రముఖ రచయితలు రఘు, పుష్ప పలాట్ రచించిన 'ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్' ఆధారంగా కరణ్ సింగ్ ఈ మూవీని తెరకెక్కించారు. స్వాతంత్య్ర సంగ్రా మంలో అత్యంత దురదృష్టకర, హేయమైన సంఘటనగా నిలిచిపోయిన ఘటనల్లో జలియన్వాలా బాగ్ ఉదంతం ఒకటి. 1919 ఏప్రిల్ 13న అమృత్ సర్ లోని జలియనా వాలా బాగ్ లో జరిగిన కాల్పులు, తొక్కిసలా టలో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.

Tags

Next Story