Kesari Chapter 2 : ఓటీటీలోకి కేసరి: చాప్టర్ 2

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో కరణ్ సింగ్ త్యాగి తెరకెక్కించిన చిత్రం కేసరి: చాప్టర్ 2. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ ఉదంతం నే పధ్యంలో దీన్ని తెరకెక్కించారు. నాటి పంజాబ్ జనరల్ తన అధికార బలంతో ఘటన గురించి స్థానిక వార్తాప త్రికల్లో.. మరెక్కడా సమాచారం రాకుండా చేస్తాడు. ఆ సమయంలో బ్రిటీష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న తమకు అనుకూలుడైన భారత న్యాయవాదితో ఓ కమిషన్ ఏర్పాటు చేసి తన చర్యను సమర్థించేలా రిపోర్ట్ ఇవ్వాలని కోరతాడు. ఇక ఈ కేసులో తనను తాను కాపాడుకునేందుకు పంజాబ్ జనరల్ ఒక న్యాయవాదిని రంగంలోకి దింపుతాడు. అయితే కమిషన్ సభ్యుడిగా వచ్చిన శంకరన్ పాత్రను అక్షయ్‌కుమార్ పోషించాడు. ఆయన ఈ కేసులో ఎలాంటి వాదనలు వినిపిం చాడు. పంజాబ్ జనరల్ చేసిన తప్పులు ఎలా బయటపెట్టాడు? అనే అంశాలను కథగా తెర కెక్కించారు. ఆర్.మాధవన్, అనన్య పాండే, రెజీనా కసాండ్రా కీలక పాత్రల్లో కనిపించారు. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com