Ketika Sharma : బీచ్ లో కేతిక గుర్రపు స్వారీ

Ketika Sharma : బీచ్ లో కేతిక గుర్రపు స్వారీ
X

ఢిల్లీ బ్యూటీ కేతిక సినిమా చాన్సుల కోసం ట్రై చేస్తోందా..? అనే అనుమానం కలుగుతోంది. అందం అభినయం కావాల్సినంత ఉన్నా ఈ అమ్మడికి అసలు కలిసి రావడం లేదనే చెప్పాలి. తన క్యూట్ లుక్స్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోతుందనుకున్నా.. అలా జరగలేదు. ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ భామ తన అందాల ఆరబోతతో చాన్సుల కోసం ట్రై చేస్తున్నట్టుగా ఉంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ డెబ్యూ మూవీ రొమాంటిక్ తో హీరోయిన్ గా మారారు. ఫస్ట్ సినిమాతో హిట్ అందుకోకపోయినా క్రేజ్ సొంతం చేసుకుంది.ఆ తర్వాత నాగశౌర్య లక్ష్య, వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా సినిమాల్లో హీరోయిన్ గా నటించినా... అనుకున్న స్థాయిలో హిట్లు అందుకోలేకపోయారు. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో ఛాన్స్ అందుకున్నారు. భారీ మల్టీస్టారర్ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారుతారని అంతా అనుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో కనిపించలేదు. ఇప్పుడు యంగ్ హీరో శ్రీ విష్ణు సరసన ఓ సినిమాలో నటిస్తోంది కేతిక. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేతిక బీచ్ లో గుర్రపు స్వారీ చేస్తూ అందాలు ఆరబోస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Tags

Next Story