KGF 3 : త్వరలోనే కేజీఎఫ్ 3 .. అప్డేట్ ఇస్తాము: హీరో యశ్

KGF 3 : త్వరలోనే కేజీఎఫ్ 3 .. అప్డేట్ ఇస్తాము: హీరో యశ్
X

కన్నడ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద ఊహించని వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్-2’ మూవీ ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ రెస్సాన్స్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలో.. సినీ ప్రియులంతా ‘కేజీఎఫ్-3’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో యశ్ ‘కేజీఎఫ్-3’ అప్డేట్ ఇచ్చారు. ‘‘మేము ప్రామిస్ చేసినట్లుగా ‘కేజీఎఫ్-3’ ఖచ్చితంగా వస్తుంది. మాకు ఒక ఆలోచన ఉంది. దాని ప్రకారంగానే ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు మీ కూడా ఆ ఆలోచన గురించి చెప్తాము. ప్రేక్షకులు గర్వపడే విధంగా సినిమా ఉంటుంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్డేట్ కూడా ఇస్తాము" అంటూ చెప్పుకొచ్చాడు యష్.

Tags

Next Story