KGF Chapter 3 Vs Salaar 2 : 'సాలార్ 2' కంటే ముందే 'కేజీఎఫ్ చాప్టర్ 3'

KGF Chapter 3 Vs Salaar 2 : సాలార్ 2 కంటే ముందే కేజీఎఫ్ చాప్టర్ 3
'కేజీఎఫ్ చాప్టర్ 3' ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సాలార్ 2కంటే ముందే వస్తుందా.. ?

'సాలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' పై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాలార్ 2 కంటే ముందే కేజీఎఫ్ పార్ట్ 3 షూటింగ్ మొదలు కానున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 'కేజీఎఫ్ - పార్ట్ 1, పార్ట్ 2'లతో భారీ విజయాలు అందుకున్న ప్రశాంత్ నీల్.. ఇప్పుడు చాప్టర్ 3తో వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని 'కేజీఎఫ్ చాప్టర్ 2' వార్షికోత్సవం సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ చాప్టర్ 3 కి సంబంధించిన గ్లింప్సెస్ తో ఈ విషయాన్ని వెల్లడించింది.

దీంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ చాప్టర్ 3'ని ఎప్పుడు ప్రారంభిస్తారా అని యశ్ ఫ్యాన్స్ అమిత ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఇప్పుడు 'సాలార్ 2' షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే ఈ చిత్రం ప్రారంభమవుతుందనే వార్త రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని సమాచారం.

'కేజీఎఫ్' ఫ్రాంచైజీ , 'సాలార్: పార్ట్ 1 -సీజ్ ఫైర్' వంటి చిత్రాలతో ప్రశాంత్ నీల్.. ప్రేక్షకులకు సరికొత్త యాక్షన్ ప్రపంచాన్ని పరిచయం చేశాడు. ఇప్పటికే విడుదలైన 'కేజీఎఫ్ చాప్టర్ 1' అండ్ 2 లు ఏ రేంజ్ లో విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే 'సాలార్: పార్ట్ 1' అంతటా సంచలనం సృష్టిస్తోంది.

'సాలార్ పార్ట్ 1'లో ప్రభాస్ సరనస శ్రుతి హాసన్ నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీ సెప్టెంబర్ 2023లో రిలీజ్ కానుంది.

ఇక ప్రభాస్ విషయానికొస్తే.. ఆయన నటించిన 'ఆదిపురుష్' బాక్సాఫీస్ వద్ద భారీ అపజయాన్ని చవిచూసింది. రామాయణాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ సినిమా ముందు నుంచీ అనేక విమర్శలను ఎదుర్కొంది. విడుదల అనంతరం కూడా అదే పంథాను కొనసాగించింది. సినిమాలోని డైలాగులు, పాత్రల వేషధారణ, పేలవమైన వీఎఫ్ఎక్స్ కారణంగా మూవీపై పలు విమర్శలు వచ్చాయి. రామాయణాన్ని అపహాస్యం చేశారని కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాను సైతం రద్దు చేశారు. ప్రారంభంలో మూవీకి మంచి వసూళ్లే వచ్చినా.. అవి ఆ తర్వాత ఊహించని రేంజ్ లో పడిపోయి మేకర్స్ ను డీలా పడిపోయేలా చేశాయి.


Tags

Read MoreRead Less
Next Story