Khushbu : నా చెప్పుల సైజు 41.. ఖుష్బూ కీలక కామెంట్స్

గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఎస్ఐ వేడుకల్లో భాగంగా సినీ పరిశ్రమలో మహిళల భద్రతపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నటి ఖుష్బూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలపై వేధింపులు కేవలం ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని చోట్లా ఉన్నాయన్నారు. బస్సులో, ట్రైన్లో, ఆటోల్లో కూడా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. తాను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. ఓ సినిమా సెట్లో హీరో తనతో అసభ్యంగా మాట్లాడారని అన్నారు. మాకు ఏదైనా ఛాన్స్ ఉందా? అని అన్నారని, వెంటనే 'నా చెప్పుల సైజు 41. షూటింగ్ సెట్లోనే అందరిముందు చెంప పగలకొట్టనా? అని వార్నింగ్ ఇచ్చా' అని అన్నారు. సినీ ఇండస్ట్రీలో మహిళల వేధింపులపై మాలీవుడ్లో పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చిన సంగతి తెలిసిందే. హేమ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత చాలామంది తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటికి చెప్పారు. పలువురు నటులపై ఫిర్యాదులు రావడంతో కేసులు కూడా నమోదయ్యాయి. సీనియర్ నటి ఖుష్బూ కూడా పలుమార్లు రియాక్ట్ అయ్యారు. తాజాగా తనకు జరిగిన అవమానాన్ని చెప్పడం విశేషం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com