Khushi Kapoor : తల్లిని తలుచుకుని ఖుషీ కపూర్ ఎమోషనల్

Khushi Kapoor : తల్లిని తలుచుకుని ఖుషీ కపూర్ ఎమోషనల్
X

ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, దివంగత నటి శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా లవ్ యాపా. ఈ సినిమా కామెడీ, లవ్, డ్రామా బ్యాక్ డ్రాప్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ నిన్న ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు శ్రీదేవిని గుర్తుకు తెచ్చుకున్నారు. ఖుషీ కపూర్ లో శ్రీదేవి నటన కనిపించిందనిపేర్కొన్నారు. ఈ సమయంలో స్టేజీ మీద ఉన్న ఖుషీ తాను మాట్లాడుతున్న సమయంల తల్లి శ్రీదేవిని గుర్తుకు తెచ్చుకొని ఎమోషన్ అయ్యింది.

‘‘శ్రీదేవి అంటే నాకెంతో ఇష్టం. కెరీర్‌ ఆరంభం నుంచి ఆమెను అభిమానిస్తూనే ఉన్నా. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు చెప్పా. ఆమెతో ఒక్కసారైనా కలిసి వర్క్‌ చేయాలనుకున్నా. దురదృష్టవశాత్తూ నా కల నెరవేరలేదు. ఏది ఏమైనా నేను ఎప్పటికీ ఆమెకు వీరాభిమానినే. ఇది ఖుషి చిత్రం. ఇది ఆమెకెంతో ప్రత్యేకమైన క్షణం. ఈ చిత్రాన్ని ఇప్పటికే చూశాను. ఇందులో ఖుషీ కపూర్‌ యాక్టింగ్‌ చూస్తుంటే శ్రీదేవిని చూసినట్లు అనిపించింది. శ్రీదేవి ఎక్కడ ఉన్నా ఖుషీ విషయంలో ఆమె ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆమె ఆశీస్సులు వీళ్లపై ఎప్పుడూ ఉంటాయి’’ అని అమీర్ అన్నారు.

Tags

Next Story