K RAMP : దీపావళికి కిరణ్ అబ్బవరం కే ర్యాంప్

K RAMP : దీపావళికి కిరణ్ అబ్బవరం కే ర్యాంప్
X

జైన్స్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా కే ర్యాంప్. నాగ శౌర్య యొక్క రంగబలి, ఉన్ని ముకుందన్ యొక్క మార్కోలో ప్రధాన పాత్రలు పోషించిన యుక్తి థరేజ ఈ సినమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. క సినిమాతో సత్తా చాటిన కిరణ్ అబ్బవరం నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో రామానాయుడు స్టూడియోలో ప్రా రంభమైంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. ఇందుకు సంబందించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దీపావళికి సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు కిరణ్. దీనికి 'ఎంటర్ టైన్ మెంట్, ఎంటర్ టైన్ మెంట్, ఎంటర్ లైన్ మెంట్' అనే ట్యాగ్ ఇచ్చాడు. అభిమానులు ఈ పోస్టర్ చూసి సంతో షం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story