Kiran Abbavarm : అన్నని ఎలా పరిచయం చేయాలి.... హీరో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ పోస్ట్

Kiran Abbavarm : ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడిప్పుడే నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం. తన ఎదుగుదలకు తోడ్పడిన అన్న అకాల మరణం అతడిని కలచి వేసింది. రోడ్డు ప్రమాదంలో అన్న రామాంజులు రెడ్డి ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేక పోతున్నాడు. అన్నీ తానై నడిపించిన అన్న ఇక లేడని తెలిసి కుమిలిపోతున్నాడు.. సోషల్ మీడియా వేదికగా తన భావోద్వేగాన్ని పంచుకున్నాడు. రేయ్.. కిరా.. మన ఊరికి రోడ్డు సరిగా లేదు.. మన ఇద్దరిలో ఎవరో ఒకరు ఏదో ఒకటి గట్టిగా సాధించాలి.
మన ఊరికి కొంతైనా చేయాలి అనే వాడు.. నన్ను హీరోగా చూడడం కోసం తన సంతోషాలను త్యాగం చేశాడు. నా కలలను సాకారం చేయడం కోసం ఎంతో కష్టపడ్డాడు.. నన్నెప్పుడు పరిచయం చేస్తావురా అని అడిగేవాడు.. కానీ ఇలా పరిచేచయం చేయాల్సి వస్తుందని ఊహించలేదు. నేను ఇప్పుడు నా అన్నని ఎలా పరిచయం చేయాలి.. నా వెనుక ఉన్నది ''అబ్బవరం రామాంజులు రెడ్డి'' మా అన్న అని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించిన ఫోటో షేర్ చేశాడు కిరణ్.
తన అభిమానులను సురక్షితంగా డ్రైవ్ చేయమని కోరాడు.. రోడ్డు ప్రమాదం కారణంగా నా అన్న ప్రాణాలు కోల్పోయాడు.. ప్లీజ్ టేక్ కేర్.. మీ సంతోషం కోసం కష్టపడుతున్న వారు మీకు ఏదైనా జరిగితే భరించలేరు అని రాశాడు. కిరణ్ ఎమోషనల్ పోస్ట్ చూసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ అతడిని ఓదార్చారు.. నీ పోస్ట్ చూసి చాలా బాధపడ్డాను. మీ అన్న మరణం నిన్ను తీవ్రంగా కలచి వేసిందని నాకు తెలుసు.. ఇది నీకు చాలా పెద్ద నష్టం. కానీ మీ అన్న నిన్ను నడిపిస్తుంటాడని ఖచ్ఛితంగా నమ్ముతున్నాను అని కిరణ్ బాధను కొంతైనా తగ్గించే ప్రయత్నం చేశారు తరుణ్ భాస్కర్.
కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి బుధవారం చెన్నూరు (కడప) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com