Pushpa 2 : 24న కిస్సిక్ ఐటమ్ సాంగ్ రిలీజ్.. చెన్నైలో పుష్ప-2 జాతర

పుష్ప -2 మాస్ జాతరకు రంగం సిద్ధమైంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో బీహార్ ను ఊపేసిన అల్లు అర్జున్ అండ్ టీమ్ .. మరో భారీ ఈవెంట్ కు రెడీ అయ్యారు. నవంబర్ 24న సాయంత్రం 5 గంటల నుండి పుష్ప వైల్డ్‌ఫైర్ ఈవెంట్.. లియో ముత్తు ఇండోర్ స్టేడియం, సాయి రామ్ ఇంజినీరింగ్ కళాశాలల జరగనుంది అని ఎక్స్ లో ప్రకటించారు. ఇదే ఈవెంట్ లో మూవీలోని మోస్ట్ అవైటెడ్ ఐటమ్ సాంగ్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. అల్లు అర్జున్-శ్రీలీల స్టెప్పులు, దేవిశ్రీ ట్యూన్ వినేందుకు ఆసక్తిగా ఉన్నారు. పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతుండటంతో.. ఇండియా వ్యాప్తంగా గ్రాండ్గా ప్రమోషన్స్ చేస్తున్నారు. త్వరలో 'తెలుగు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి' రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లేదా ఎల్బీ స్టేడియంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com