Pushpa 2 : గెట్ రెడీ.. కిస్సిక్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Pushpa 2 : గెట్ రెడీ.. కిస్సిక్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
X

అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా వస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, స్పెషల్ పోస్టులు అన్నీ రికార్డులు తిరగరాశాయి. ఇక ఈ మూవీని ఎక్కువ థియేటర్ల లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దీంతో పుష్ప 2 మూవీ బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ మూవీగా రికార్డ్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. కుర్రకారు మతిపోగొట్టేలా ఆ సాంగ్ ఉండబోతుందని మేకర్స్ ఇప్పటికే చెప్తున్నారు. ఇక తాజా అప్డేట్స్ ప్రకారం కిస్సిక్ సాంగ్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన ఐటెం సాంగ్స్ ఇదే ది బెస్ట్ ఐటెం నంబర్ అంటూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. అల్లు అర్జున్, శ్రీలీల డాన్స్ తో పాట స్థాయి మరింతగా పెరిగిందని, సినిమాలో ఈ పాట చాలా స్పెషల్ గా ఉండటం మాత్రమే కాకుండా, అంచనాలు పెంచే విధంగా ఉంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఇక ఈ క్రేజీ సాంగ్ రేపు రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags

Next Story