Hanuman : హనుమాన్ కంటే శ్రీ ఆంజనేయం బెటర్... కృష్ణ వంశీ ఏమన్నారంటే
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై హిట్ సినిమాగా నిలిచిన చిత్రం హనుమాన్ (Hanuman). ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతుంది. తేజ సజ్జా హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదేంటంటే.. హనుమాన్ కంటే శ్రీ ఆంజనేయం సినిమానే గొప్ప సినిమా అంటూ కృష్ణ వంశీ ఎక్స్ పేజీలో పలు కామెంట్స్ చేస్తున్నారు.
దీనిపై కృష్ణ వంశీ రియాక్ట్ అయ్యారు. ప్లీజ్ ప్రేక్షకులను మాత్రం తిట్టకండి వాళ్ల నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు.. శ్రీ ఆంజనేయం (Sri Anjaneyam) సినిమా విషయంలో ఎక్కడో తప్పు జరిగింది. ఈ చిత్రంలోని కొన్ని అంశాలు వాళ్లకు నచ్చలేదు. కానీ మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు అని కృష్ణ వంశీ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నితిన్, ఛార్మి హీరోహీరోయిన్లుగా కృష్ణ వంశీ తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం సినిమా 2004 జూలై 24 విడుదలైంది. అర్జున్ సర్జా, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. నితిన్ పాత్రను కూడా మరీ అమాయకంగా చూపించి.. ఛార్మి పాత్రను క్రియేట్ చేసిన విధానం నచ్చక సినిమా ఆడలేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com