సినిమా

Krishnam Raju : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రాధేశ్యామ్'లో రెబల్ స్టార్..!

Krishnam Raju : ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.. ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’లో పరమహంస పాత్రను రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించనున్నారు.

Krishnam Raju : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..  రాధేశ్యామ్లో  రెబల్ స్టార్..!
X

Krishnam Raju : ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.. ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాధేశ్యామ్'లో పరమహంస పాత్రను రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించనున్నారు. ఈ మేరకు ఆఫీషియల్ గా మేకర్స్ అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర కోసం ఆయన ఏడాదిగా గడ్డం పెంచారు. ప్రభాస్, కృష్ణంరాజు కలిసి నటిస్తోన్న మూడో సినిమా ఇది.. అంతకుముందు వీరిద్దరూ కలిసి బిల్లా, రెబల్ చిత్రాలలో కలిసి నటించారు. కాగా రాధేశ్యామ్ చిత్రానికి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.


Next Story

RELATED STORIES