సినిమా

Krithi Shetty: ప్రభాస్ కోసం ముగ్గురు భామలు.. అందులో ఒకరు కృతి శెట్టి..

Krithi Shetty: ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది.

Krithi Shetty: ప్రభాస్ కోసం ముగ్గురు భామలు.. అందులో ఒకరు కృతి శెట్టి..
X

Krithi Shetty: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల 'రాధే శ్యామ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చకపోయినా.. ప్రేమకథలు ఇష్టపడే వారికి మాత్రం రాధే శ్యామ్ సూపర్ హిట్. ఇక రాధే శ్యామ్ విడుదల అయిపోవడంతో తన తరువాతి ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టాడు ప్రభాస్. అందులోనూ ప్రభాస్.. మారుతి డైరెక్షన్‌లో రానున్న 'రాజా డీలక్స్' సినిమాపై అందరి దృష్టి ఉంది.

మారుతి ఇప్పటివరకు మినిమమ్ గ్యారెంటీ హీరోలతో, మినిమమ్ గ్యారెంటీ కథలతోనే సినిమాలను తెరకెక్కించాడు. ఇప్పటివరకు తను ఒక్క స్టార్ హీరోను కూడా డైరెక్ట్ చేయలేదు. అయితే ఈ డైరెక్టర్‌కు ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. పైగా అది మారుతి మార్క్ ఉన్న కామెడీ సినిమా అని కూడా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ మూవీ పేరు 'రాజా డీలక్స్' అంటూ టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'రాజా డీలక్స్' చిత్రంలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే శ్రీలీల, మాళవిక మోహనన్‌ను హీరోయిన్లుగా సెలక్ట్ చేసినట్టు సమాచారం. అయితే మూడో హీరోయిన్‌గా కృతి శెట్టి ఫైనల్ అయ్యిందంటూ ఫిల్మ్ సర్కి్ల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అస్సలు తీరిక లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న బేబమ్మ.. ఏకంగా పాన్ ఇండియా స్టార్‌తోనే సినిమా ఛాన్స్ కొట్టేసింది అంటూ తన ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES