Krithi Shetty : బేబమ్మ ట్రెడిషనల్ లుక్.. ఫోటోలు వైరల్

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ కృతి శెట్టి. ఆ తర్వాత శ్యాం సింగరాయ్, బంగార్రాజు ఈ సినిమా సినిమాలతో సక్సెస్ అందుకున్న కృతి ఆ తర్వాత హిట్ అన్న మాటకి దూరమైంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా అమ్మడికి ఏమాత్రం లక్ కలిసి రాలేదు. తెలుగులో ఇక కుదరదని ఫిక్స్ తమిళ్ లో ప్రయత్నాలు మొదలు పెట్టింది కృతి శెట్టి అక్కడ తను చేస్తున్న రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక మలయాళంలో కూడా కృతి శెట్టి ఏ.ఆర్.ఎం చేసినా అది అక్కడ పర్వాలేదు అనిపించుకుంది కానీ మిగతా భాషల్లో సరిగా ఆడలేదు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది. ఇటీవలే మోడ్రన్ గ్లామర్ ఫొటోషూట్లు షేర్ చేస్తూ, యువతను, ఫ్యాషన్ లవర్స్న ఆకట్టుకుంటోంది కృతి. రొటీన్ స్టెలింగ్ కు భిన్నంగా, ట్రెడిషనల్ వేర్ కూడా తనదైన మార్క్ చూపిస్తోంది. ఫ్యాన్స్ కామెంట్స్ లో ఆమె న్యాచురల్ బ్యూటీని, నవ్వును ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com