Kriti Sanon: స్టార్ హీరోలపై కృతి సనన్ కామెంట్స్.. అందుకే తనతో నటించరంటూ..

Kriti Sanon (tv5news.in)
Kriti Sanon: తెలుగులో హీరోయిన్‌గా పరిచయమయినా కూడా.. ప్రస్తుతం హిందీలో తన మార్క్ క్రియేట్ చేసుకొని దూసుకుపోతోంది కృతి సనన్. ప్రస్తుతం ప్రభాస్ 'ఆదిపురుష్'లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసి టాలీవుడ్ ప్రేక్షకుల చూపును మరోసారి తనవైపు తిప్పుకుంది. అయితే ఈ భామ తాజాగా స్టార్ హీరోల గురించి, సినిమాల్లో వారి పాత్రల గురించి డేరింగ్‌గా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
మామూలుగా కమర్షియల్ సినిమాలంటే మూవీ మొత్తం హీరోనే కనిపిస్తాడు. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితమవుతుంది. కానీ ఇప్పుడు అలా కాదు.. సినిమాల్లో హీరోయిన్లకు సమానంగా ప్రాధాన్యత ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కానీ ఇంకా కొన్ని కమర్షియల్ సినిమాలు వాటి పంతాను ఏ మాత్రం మార్చుకోలేదు. దీనిపై కృతి సనన్ ఘాటుగా స్పందించింది.
హీరోలకు సమానంగా హీరోయిన్లకు సినిమాల్లో ప్రాధాన్యత ఉండడం లేదని కృతి తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. హీరోయిన్‌కు 60 శాతం ప్రాధాన్యత ఉండి, హీరోలకు 40 శాతం ప్రాధాన్యత ఉంటే.. అలాంటి క్యారెక్టర్ చేయడానికి ఏ స్టార్ హీరో ముందుకు రాడు అంటూ కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పుకొచ్చింది. ఈ కారణంగానే తాను నటించిన కొన్ని సినిమాలలో స్టార్ హీరోలు తనతో నటించడానికి ఆసక్తి చూపించలేదంటూ స్పష్టం చేసింది కృతి సనన్. ఈ పద్ధతి మారితే బాగుంటుందని కృతి తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com