Nayanthara : పిల్లల క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన లేడీ సూపర్ స్టార్

‘లక్ష్మి' మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ నయనతార గురించి పరిచయాలు అక్కర్లేదు. తక్కువ టైంలోనే లేడీ సూపర్స్టార్ మంచి ఫేమ్ సంపాదించు కున్న ఈ భామ.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంటోంది. అటు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్ట్ నయన్ ను కథానాయికగా అనుకున్నట్టు ప్రచారమూ జరుగుతోంది. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ కోసం కొంత టైం కేటాయిస్తుంది. డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న నయనతార.. సరోగసి ద్వారా ఇప్పటికే ఇద్దరు కవలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం భర్త, పిల్లలతో సరదాగా గడుపుతూ.. లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా నయన తార ఇన్స్టాగ్రామ్ వేదికగా తన పిల్లలకి సంబంధించిన క్యూట్ పిక్ షేర్ చేసింది. అందులో తన ఇద్దరు బాయ్స్ ఆకాశంలో ఇంద్రధనస్సును చూస్తుండగా, ఆ సమయంలో ఫొటో తీసి 'ఫస్ట్ రెయిన్ బో”.. ఇది ఎప్పుడూ చిన్న విషయాలే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com