Lal Salaam-OTT : ఓటీటీలోకి లాల్ సలాం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Lal Salaam-OTT : ఓటీటీలోకి లాల్ సలాం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X

విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య తెరకె క్కించిన చిత్రం లాల్ సలాం. సూపర్ స్టార్ రజనీ కాంత్ ఇందులో ఓ కీలక పాత్రలో నటించాడు. గతేడాది ప్రారంభంలో థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. సన్ నెక్స్ట్ వేదికగా జూన్ 6 నుంచి అందుబాటులోకి రానుంది. హిందూ ముస్లింలు ఐకమత్యంగా మెలిగే ఊరికి సంబంధించిన కథతో దీన్ని రూపొందించారు. ఆ ఊరు నుంచి మొయి నుద్దీన్ (రజనీకాంత్ ) ముంబైకి వెళ్లి గొప్ప వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. తన కొడుకును క్రికెటర్ను చేయాలన్నది ఆయన కల. అయితే అతడు ఊరు వదిలి వెళ్లాక కొందరు రాజకీయ నాయకుల కుట్రల వల్ల ఊళ్లోని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోతారు. ఇక ఆ ఊళ్లో రెండు జట్ల మధ్య జరిగే క్రికెట్ ఆట కూడా మతం రంగు పులుముకుంటుంది. ఒకరోజు మ్యాచ్ నడుస్తుండగా రెండు టీమ్స్ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. అసలు క్రికెట్లో జరిగిన గొడవకు కారణమేంటి? అనే అంశాన్ని కథగా తెరకెక్కించారు.

Tags

Next Story