RC 16 Movie : ఆర్సీ 16 సినిమా పై మరో అప్డేట్
ఆర్సీ 16 సినిమా పై మరో అప్డేట్ వచ్చింది. కీలక అప్డేట్ ను దర్శకుడు బుచ్చిబాబు షేర్ చేశారు. ఆయన చేతిలో ఫైల్ పట్టుకొని మైసూర్ చాముండేశ్వరి ఆలయం ముందున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈరోజు తమకు బిగ్ డే అని పేర్కొన్నారు. “ఇది మాకు చాలా ముఖ్యమైన రోజు. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. మైసూ ర్లోని చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఇది మొదలైంది. మీ ఆశీస్సులు కూడా మాకు కావాలి” అని ఆయన పేర్కొన్నారు. ఆర్సీ 16 హ్యాష్ ట్యాగ్ జత చేశారు. బుచ్చిబాబు పెట్టిన పోస్ట్ తో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైందని తెలుస్తోంది. మైసూర్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక సెట్లో దాదాపు మూడు రోజుల పాటు షూట్ జరగనుందని.. కీలక సన్నివేశాల ను తొలి షెడ్యూల్లో పూర్తి చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు. ఈ మూవీలో రామ్చరణ్ పాత్ర పవరు ల్గా ఉండనుంది. జాన్వీకపూర్ కథానాయికగా నటి స్తోంది. కన్నడ నటుడు శివ రాజ్కుమార్, జగప తిబాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. సంగీతం ఏఆర్ రెహమాన్ అంది స్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నా యి. ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com