Lavanya Tripathi : లావణ్య స్పెషల్ పోస్ట్

టాలీవుడ్ ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే అందం, అభినయం, నటనతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తరువాత మెగా హీరో వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడింది. ఈమధ్యే పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వివాహనంతరం కూడా ఈ జంట సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ మెగా కోడలిగా బాధ్యతలు స్వీకరిస్తుంది. అయితే లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్ వివాహామయ్యాక వెకేషన్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలకు కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు. తాజాగా ఈ లొట్టచెంపల బ్యూటీ డెహ్రడూన్‌కు వెళ్లి అక్కడ వాతావరణాన్ని ఆస్వాదిస్తుంది. ‘డెహ్రడూన్ అంటే చాలా ఇష్టమని, లవ్’ అని లవ్ సింబల్ జోడించి పలు ఫొటోలు, వీడియోలు పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com