Akhanda 2 : బాలయ్యతో లయ కూతురు

Akhanda 2 : బాలయ్యతో లయ కూతురు
X

నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ 2 సినిమాను స్టార్ట్ చేశాడు. బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అఖండ భారీ విజయం సాధించిన నేపధ్యంలో పార్ట్ 2పై అంచనాలు కూడ అదే రేంజ్ లో ఉన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణంలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. అఖండ 2 సినిమాలో సీనియర్ నటి లయ కూతురు శ్లోక కీ రోల్ చేస్తోందట. కథకు చాలా ఇంపార్టెన్స్ అయిన ఈ పాత్రకు శ్లోక అయితేనే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే అఖండ 2 షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే అమెరికాలో ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ లో శ్లోక కి సంబందించిన సన్నివేశాల షూటింగ్ కంప్లీట్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 25న దసరా కానుకగా వచ్చే ఏడాది రిలీజ్ చేస్తునట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అలాగే అఖండ 2 టైటిల్ కి సంబందించిన ప్రోమోని రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Tags

Next Story