పులితో ఫోటో దిగాలనుకున్న ప్రముఖ మోడల్‌.. చివరికి ఇలా..

పులితో ఫోటో దిగాలనుకున్న ప్రముఖ మోడల్‌.. చివరికి ఇలా..
Leopard Attack: కాస్త రిస్క్ చేసి ఆటవీ ప్రాంతం సమీపంలో ఫొటోషూట్‌ కూడా నిర్వహించింది.

Leopard Attack: పులితో ఫోటో దిగాలని అనిపించింది ఈ మోడల్ కి. ఏదైనా కొత్తగా ట్రై చేయాలనే ప్రయత్నిస్తుంది జెస్సికా. దాంతో కాస్త రిస్క్ చేసి ఆటవీ ప్రాంతం సమీపంలో ఫొటోషూట్‌ కూడా నిర్వహించింది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. రెండు చిరుత పులులు దాడి చేసి గాయపరిచాయి. జర్మనీకి చెందిన ప్రముఖ మోడల్‌ జెస్సికా లీడోల్ఫ్‌(36)పై పులులు దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఓ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం. జెస్సికా లీడోల్ఫ్‌ తూర్పు జర్మనీలోని ఆటవీ ప్రాంతం సమీపంలో సాక్సోనీ-అన్హాల్ట్ రాష్ట్రంలో నెబ్రా అనే ప్రైవేటు స్థలంలో ఉన్న రిటైర్‌మెంట్‌ హోంను సందర్శించింది. చిరుతలు పులులు ఉండే బోనుకు సమీపంలో ఫొటోషూట్‌ నిర్వహించింది. ఈ క్రమంలో రెండు చిరుతలు జెస్సికా లీడోల్ఫ్‌పై ఒక్కసారిగా దాడి చేసినట్లు సమాచారం. హెలికాప్టర్‌ ద్వారా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించినట్లు స్థానిక పోలీసులు మీడియాతో పేర్కొన్నారు.

ప్రస్తుతం లీడోల్ఫ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, చిరుతపులులు దాడి చేయడంతో ఆమె తలకు తీవ్ర గయాలు అయ్యాయి. దాంతో వైద్యులు సర్జరీ చేశారని పోలీసులు చెప్పినట్లు సదరు మీడియా వెల్లడించింది. అయితే తన తల, చెవులు, చెంపలపై చిరుతలు పదే పదే దాడి చేశాయని జెస్సికా స్థానిక మీడియాతో వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సదరు రిటైర్ట్‌ హోం యజమాని బిర్గిట్‌ స్టేచ్‌ను పోలీసులు కోరగా ఆయన మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story