Little Hearts Movie : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న లిటిల్ హార్ట్స్

Little Hearts Movie : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న లిటిల్ హార్ట్స్
X

చిన్న బడ్జెట్ తో రూపొందిచ రొమాంటిక్ కామెడీ మూవీ లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రారంభాన్ని నమోదు చేసింది. మౌలి తనుజ్ ప్రశాంత్, శివాని నగరం హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మొదటి రోజు అంచనాలను మించి వసూళ్లు సాధించింది. అమెరికాలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుం ది. తొలిరోజు రూ.1.32 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. కొత్తవారితో తెరకెక్కిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం, అధిక డిమాండ్ కారణంగా రెండో రోజు నుంచి స్క్రీన్ల సంఖ్య పెంచుతు న్నారు. ప్రచారంతో ప్రత్యేకతను చూపిన ఈ మూవీ యూనిట్ సోషల్ మీడియాలో పెద్ద హంగామా చేసింది. ఎంటర్టైనింగ్ మేకింగ్ వీడియోలు, ట్రెండీ ప్రమోషనల్ కంటెంట్ రోస్ట్ ఈవెంట్ వంటివి ప్రేక్షకుల్లో మంచి క్రేజీ కలిగించాయి. కథ కాలేజీ స్టూడెంట్స్ చుట్టూ తిరుగుతుండటంతో ఈ వ్యూహాలు ఫలించి బాక్సాఫీస్ వద్ద సక్సెస్గా మారాయి. డిస్ట్రిబ్యూసన్ బాధ్యతలను వంశీ నందికంటి, బన్నీ వాస్ నిర్వర్తించారు

Tags

Next Story