Anvesh : అన్వేష్ కు బిగ్ షాక్.. తగ్గుతాడా..?

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పంజాగుట్ట పోలీసులు. హిందూ దేవతలను, స్త్రీలను అత్యంత దారుణంగా అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారంటూ నటి కరాటే కల్యాణి, ఇతర హిందూ సంఘాల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయినా సరే వాటిపై అన్వేష్ పెద్దగా స్పందించట్లేదు. తాను విదేశాల్లో ఉన్నాడు కాబట్టి.. ఎవరిపై ఎలాంటి కామెంట్లు చేసినా సరే చెల్లిపోతుందన్నట్టే ఆయన వ్యవహారం ఉంది. ఇండియాను అవమానించేలా ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా ఎంతగా వివాదం సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.
ఈ క్రమంలోనే ఆయన వ్యాఖ్యలపై అనేక మంది పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో తాజాగా పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అలాగే ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్ లకు కూడా లేఖలు రాస్తున్నారు. అన్వేష్ అకౌంట్లు బ్లాక్ చేయాలంటూ లెటర్ రాశారు. మరి ఇంత జరిగినా సరే అన్వేష్ తగ్గుతాడా లేదంటే ఇంకా మొండిగా బిహేవ్ చేస్తాడా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఏదేమైనా అహంకారం ఎక్కువైతే ఎవరికైనా సరే శిక్ష తప్పదు అనేది మరోసారి అన్వేష్ రూపంలో బయటపడింది. బెట్టింగ్ యాప్ కేసుల్లో జనాల నుంచి కొంత సపోర్ట్ వచ్చేసరికి.. ఇష్టం వచ్చినట్టు హిందూ దేవుళ్లను అవమానించడం అంటే నిజంగా అది అన్వేష్ దురాగతానికి నిదర్శనం అంటున్నారు సోషల్ మీడియా నెటిజన్లు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
