Harsha Sai : యూట్యూబర్ హర్షసాయికు లుక్‌అవుట్ నోటీసులు జారీ

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం హైదరాబాద్ నార్సింగి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బు కూడా తీసుకున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సైబరాబాద్ సైబర్ క్రైమ్‌లో యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. హర్షసాయి ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడని ఆమె ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితురాలు పలు స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించారు.
దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యూట్యూబర్ హర్షసాయిపై ఇటీవల అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలు సేకరించి బ్లాక్‌మెయిల్ చేశాడని సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com