Lucky Bhaskar : లక్కీ భాస్కర్ @11.7 మిలియన్ వ్యూస్

దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'లక్కీ భాస్కర్ నెట్ ఫ్లిక్స్న షేక్ చేస్తోంది. ఈ మూవీ థియేట్రికల్గా ఏకంగా 100 కోట్లకి పైగా కలెక్షన్స్ని లాంగ్ రన్ లో అందుకుంది. దుల్కర్ సల్మాన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా. నెట్ ఫ్లిక్స్ లో వారం రోజుల క్రితం 'లక్కీ భాస్కర్' రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఆ ఓటీటీలో ఈ చిత్రం అరుదైన ఫీట్ అందుకుంది. పాన్ ఇండియా సినిమాలపైనే 'కల్కి 2898ఏడీ', 'దేవర' సినిమాలని వ్యూవర్ షిప్ ని ఈ సినిమా బీట్ చేసింది. మొదటి వారంలోనే ‘లక్కీ భాస్కర్’ 11.7 మిలియన్ వ్యూవ్స్ ని ఈ చిత్రం సాధించింది. 'కల్కి' మూవీ మొదటి వారంలో 5.1, 'దేవర' 8.6 మిలియన్ వ్యూవ్స్ ని మాత్రమే అందుకున్నాయి. ఇక రెండో వారంలో కూడా ఇప్పటికే 6.6 మిలియన్ వ్యూవ్స్ తో నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో టాప్ 10లో 'లక్కీ భాస్కర్' ఉంది. అయితే ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ లో మొదటి వారం అత్యధిక వ్యూవ్స్ సాధించిన సినిమాగా విజయ్ సేతుపతి 'మహారాజ' ఉంది. ఈ చిత్రం ఏకంగా 19.7 మిలియన్ వ్యూవ్స్ సాధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com