Lucky Bhaskar : 15 దేశాల్లో లక్కీ భాస్కర్ హవా

X
By - Manikanta |4 Dec 2024 12:00 PM IST
మమ్మూటి కుమారుడు దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరీ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా లక్కీ. భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ క్రైమ్ డ్రామాకు థియేటర్లలో చక్కని ఆదరణ దక్కింది. తాజాగా ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రీమింగ్ అవుతోంది. లక్కీ భాస్కర్ విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే ప్రేమను నెటిక్స్లోలోనూ చూపుతున్నారు. ఈ సినిమా 5 భాషల్లో విడుదలైంది. 15 దేశాల్లో టాప్ 10 సినిమాల్లో 'లక్కీ భాస్కర్' మొదటి స్థానంలో నిలిచిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం నెటిక్స్లో రిలీజ్ అయ్యేవరకు ఎన్టీఆర్ నటించిన 'దేవర'నే టాప్వన్లో ఉంది. లక్కీ భాస్కర్ వచ్చిన తర్వాత ‘దేవర’టాప్3లోకి వెళ్లింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com