Gopichand : బర్త్ డే బాయ్ గోపీచంద్ ఫామ్ లోకి వచ్చేనా..?

Gopichand  :  బర్త్ డే బాయ్ గోపీచంద్ ఫామ్ లోకి వచ్చేనా..?
X

గోపీచంద్.. ఈయన తండ్రి టి కృష్ణ ఒకప్పుడు పెద్ద దార్శనిక దర్శకుడు. కానీ చిన్న వయసులోనే చనిపోయాడు. ఆయన వారసుడుగా వెండితెరపై వలపు పెంచుకున్న ఆ కుర్రాడు.. ఆ ఏజ్ కు రాగానే ‘తొలి వలపు’అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఫస్ట్ మూవీ డిజాస్టర్. బ్యాక్ గ్రౌండ్ లేదు. అండగా నిలిచేందుకు పోకూరి బాబూరావు లాంటి నిర్మాత ఉన్నా.. ఆయనే నిర్మించిన తొలి వలపు పోయేసరికి డీలా పడ్డాడు. కట్ చేస్తే ముందు ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలనుకున్నాడు. విలన్ గా టర్న్ తీసుకున్నాడు. ‘జయం’మూవీతో విలన్ గా మారాడు. విలన్ గా అతని నటనకు విజిల్స్ పడ్డాయి. బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ కూడా వచ్చింది. టాలీవుడ్ కు సరికొత్త విలన్ దొరికాడు అన్నారు. ఆ వెంటనే నిజం మూవీలో మహేష్ బాబుకు విలన్ అద్భుతం అనిపించాడు. దేవుడు అనే పాత్రలో అతను పండించిన విలనీకి చాలామంది భయపడ్డారు. నెక్ట్స్ ప్రభాస్ తో వర్షం. వర్షం మూవీలో భద్రన్నగా మరోసారి అద్భుతమైన విలనీ పండించాడు. కానీ మనసులో ఎక్కడో నేను హీరో మెటీరియల్ కదా అనే భావన. ఆ భావనకు పదును పెట్టి మరోసారి ‘యజ్ఞం’చేశాడు. ఇది ఫలించింది. యజ్ఞం బ్లాక్ బస్టర్ అయింది. ఆ వెంటనే ఆంధ్రుడు, రణం అంటూ వరుస విజయాలు. ఒక్కడున్నాడుతో అద్భుతమైన నటన చూపించాడు. లక్ష్యం, శౌర్యం, శంఖం, గోలీమార్ వంటి విజయాలు పడ్డాయి. కానీ ఇవి బ్లాక్ బస్టర్స్ కాదు. కానీ గోపీచంద్ ను హీరోగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. అప్పటి వరకూ సీరియస్ మూవీస్ చేస్తూ వచ్చిన అతను లౌక్యం మూవీతో హిలేరియస్ గా ఎంటర్టైన్ చేశాడు. వెంటనే జిల్ తో మరో బ్లాక్ బస్టర్ పడింది. యాంగ్రీ మేన్ అనేశారు కూడా. కానీ ఆ తర్వాతే ఎక్కడో పట్టాలు తప్పాడు. వరుసగా ఫ్లాపులు.

కథలు మార్చాడు. పాత్రల్లో కొత్తదనం ఉండేలా చూసుకున్నాడు. అయినా విజయాలు రాలేదు. నిజానికి అతను కథలు మార్చినా.. తన ఇమేజ్ కోసం అంటూ అవే కథలను కాస్త అటూ ఇటూగా ప్రయత్నిస్తూ వస్తున్నాడు. అందుకే 2015లో వచ్చిన జిల్ తర్వాత ఆ స్థాయి విజయం ఇప్పటి వరకూ రాలేదు అంటే ఆశ్చర్యమే. మధ్యలో 2021లో వచ్చిన సీటీమార్ కమర్షియల్ గా కాస్త ఊరటనిచ్చింది. ఆరడుగుల బుల్లెట్ వంటి అవుట్ డేటెడ్ మూవీస్ తో పాటు రామబాణం, భీమా లాంటి కాపీ కథలూ వచ్చాయి. 2024లో అతను చాలా అంచనాలు పెట్టుకున్న విశ్వం అనే చిత్రం వచ్చింది. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా పోయింది. ప్రస్తుతం ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం పై భారీ ఆశలు పెట్టుకున్నాడు గోపీచంద్. సంకల్ప్ రెడ్డి దర్శకుడు కాబట్టి మరీ నిరాశపరచడు. కానీ ఇప్పుడు గోపీకి కావాల్సింది ఓ బ్లాక్ బస్టర్. అది పడితే మళ్లీ కెరీర్ గాడిలో పడుతుంది. మరి ఇవాళ(12.06.2025) పుట్టిన రోజు జరుపుకుంటోన్న మేఛో స్టార్ గోపీచంద్ కు ఈ మూవీతో ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ పడాలని కోరుకుంటూ మనమూ బర్త్ డే విషెస్ చెబుదాం.

Tags

Next Story