Mad Square : ‘మ్యాడ్ స్క్వేర్’ తొలిరోజు భారీ కలెక్షన్లు

Mad Square : ‘మ్యాడ్ స్క్వేర్’ తొలిరోజు భారీ కలెక్షన్లు
X

నార్నె నితిన్, సంగీత్, రామ్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో తొలిరోజు భారీగా వసూళ్లు రాబట్టినట్లు టీటౌన్ వర్గాలు తెలిపాయి. మొదటిరోజు ఏకంగా రూ.17 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. బ్రేక్ ఈవెన్ విలువ రూ.45 కోట్లు కాగా తొలిరోజే 40శాతం రికవరీ చేసినట్లు వెల్లడించాయి. లాంగ్ వీకెండ్ కావడంతో భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ.21 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. దీంతో రూ.22 కోట్ల రేంజ్ లోపు ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫిక్స్ చేశారు. డే1 కలెక్షన్ల జోరు చూస్తుంటే మొదటి వారంలోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యూత్ ను కడుపుబ్బా నవ్వించే కంటెంట్, లవ్, ఫ్రెండ్ షిప్ కు సంబంధించిన అంశాలను తెరకెక్కించడంతో ఈ సినిమాపై ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. డే1న 55 శాతం ఆక్యుపెన్సీ ని కూడా దక్కించుకుంది.

Tags

Next Story