Kannappa : కన్నప్పలో పన్నగ గా మధుబాల

Kannappa : కన్నప్పలో పన్నగ గా మధుబాల
X

మంచు విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తోన్న మూవీ కన్నప్ప. భక్త కన్నప్ప కథను అతను మరోసారి తీస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి అతనే నిర్మాత. భారీ బడ్జెట్ తో పాటు భారీ కాస్టింగ్ కూడా ఉందీ మూవీలో. అయితే ఆల్రెడీ కృష్ణంరాజు భక్త కన్నప్ప చూసిన వారికి ఇంత బిగ్ కాస్టింగ్ తో పనేముందీ మూవీకి అనే డౌట్స్ వస్తున్నాయి. అయినా విష్ణు ఈ కథను ప్యాన్ ఇండియా స్థాయిలో చెప్పబోతున్నాడు.అందుకే ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి టాప్ యాక్టర్స్ ను తీసుకున్నాడు. కాజల్ కూడా ఉంది. మోహన్ బాబు, శరత్ కుమార్ కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మరో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశాడు.

ఒకప్పుడు రోజా, జెంటిల్మన్ వంటి డబ్బింగ్ మూవీస్ తో తెలుగు వారినీ ఆకట్టుకున్న హీరోయిన మధుబాలా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. అమ్మ, అక్క అంటూ అన్ని పాత్రలూ చేస్తోన్న తను కూడా కన్నప్పలో ఓ కీలక పాత్ర చేస్తుంది. ఈ లుక్ చూస్తే తన పాత్ర కాస్త స్ట్రాంగ్ గానే ఉండబోతోందని అర్థం అవుతుంది. గిరిజన చెంచు తెగకు చెందిన తిన్నడు అనే వేటగాడు కాలక్రమంలో కన్నప్పగా ఎలా మారాడు అనేదే ఈ సినిమా కథ. అందుకే ఈ చెంచుల ముఖ్య నాయకురాలు ‘పన్నగ’ అనే పాత్రలో మధబాల కనిపించబోతోంది. ఆమె లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. పోస్టర్ తో పాటు వెపన్ అనే మాటను వాడుతూ..

‘‘ ఈ జాతి సున్నితత్వం,కౄరత్వం కలయిక

కత్తులు, డాలులు వీరి ఆయుధాలు

ఆయుధం చేపడితే కౄరత్వానికి అడ్డే లేదు.. ’’ అనే లైన్స్ వాడారు.

కానీ నిజంగా చూస్తే చెంచుల్లో కౄరత్వం లేదు. అడవిలో దొరికే వాటిని తినడం, వేటకు వెళ్లడమే వీరి వృత్తిగా ఉండేది తప్ప.. వీళ్లెప్పుడూ ఆధిపత్యాల కోసం యుద్ధాలు చేసిన వాళ్లుగా ఏ చరిత్రలోనూ చెప్పలేదు. మరి వీరిని కౄరులుగా చూపుతూ కన్నప్ప అండ్ టీమ్ ఏం చెప్పబోతున్నారు అనేది పెద్ద ప్రశ్న.

Tags

Next Story