ఒకే సినిమాలో బాలనటులుగా ఎంట్రీ.. పెద్దయ్యాక హీరో-విలన్.!

ఒకే సినిమాలో బాలనటులుగా ఎంట్రీ.. పెద్దయ్యాక హీరో-విలన్.!
Tollywood: ఒక సినిమాలో హీరోతో కలిసి జోడి కడితే.. మరో సినిమాలో హీరోకి చెల్లిగానో, అక్కగానో నటించాలి.

సినిమాల్లో ఫీల్డ్‎లో ఏదీ ఎలా జరుగుతుందో చెప్పలేం. ఒక సినిమాలో హీరోతో కలిసి జోడి కడితే.. మరో సినిమాలో హీరోకి చెల్లిగానో, అక్కగానో నటించాలి. అలా.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి.. తరువాత విలన్ గా నటించింది ఒకప్పటి హీరోయిన్ అందాల రాశి.

మహేష్ బాబు, రాశి చైల్డ్ ఆర్టిస్ట్ లు గానే తమ సీనీ కెరీర్ ను ప్రారంభించారు. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా కృష్ణ సినిమాల్లో నటించారు. అలా 1989 లో తెరకెక్కిన "గూఢ‌చారి 117" సినిమాలో మహేష్ బాబు బాలనటుడిగా నటించాడు. అదే సినిమాలో రాశి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఈ సినిమాలో వారిద్దరి మధ్య సన్నివేశాలు ఏమి ఉండవు. అయితే ఇద్దరు పెద్దవారైయ్యాక మహేశ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు.

రాశి హీరోయిన్ గా మంచి ఆఫర్లే వచ్చాయి. అయితే వారిద్దరు కలిసి నిజం అనే సినిమాలో నటించారు. 2003 లో "మహేష్ బాబు" హీరోగా దర్శకుడు తేజ తెరకెక్కించిన సినిమా "నిజం" . ఈ మూవీలో రాశి విలన్ గా నటించారు. ఈ సినిమా లో గోపీచంద్ మెయిన్ విలన్ గా నటించారు. గోపీచంద్ ప్రేయసిగా రాశి నటించారు. ఇద్దరూ కలిసి మహేశ్ బాబుతో పారాటం చేస్తారు.Tags

Read MoreRead Less
Next Story