Guntur Kaaram : ఓటీటీలోకి వచ్చేసిన గుంటూరు కారం

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం (Guntur Kaaram). ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన ఈ సినిమా సుమారు రూ. 280 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.
ఫిబ్రవరి 9 అంటే ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో సినిమా ఇది. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. థమన్ సంగీతం అందించగా.. హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు.
మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన గుంటూరు కారం చిత్రానికి థియేటర్లలో ముందుగా మిశ్రమ స్పందన వచ్చింది. అయితే, మహేశ్ బాబు ఫైట్లు, మాస్ డ్యాన్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహేశ్ బాబు తదుపరి దర్శక ధీరుడు రాజమౌళితో మూవీ చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com