ఆదిపురుష్ లో మార్పుకు గురైన డైలాగులు ఇవే..!

ఆదిపురుష్ లో మార్పుకు గురైన డైలాగులు ఇవే..!
నా డైలాగులకు అనుకూలంగా లెక్కలేనన్ని వివరణలు ఇవ్వగలను, కానీ ఇవి మీ బాధను తగ్గించలేవు.


'ఆదిపురుష్' సినిమా విడుదలైనప్పటినుంచి ట్రోల్స్ విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో బ్యాన్ ఆదిపురుష్ అంటూ ట్విట్టర్ లో వైరల్ చేస్తున్నారు. తాజాగా ట్రోల్స్ పై సినీ యునిట్ స్పందించింది. ముఖ్యంగా సినిమాలోని పలు డైలాగ్స్ ను సరిచేయడానికి పూనుకుంది. వాటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి. 'మరేగా బేటే', 'బువా కా బగిచా హై క్యా', 'జలేగీ తేరే బాప్ కీ'.. అనే డైలాగులపై రామ భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పలు సినిమా థియోటర్లలో దాడికి దిగారు. విషయాన్ని గ్రహించిన దర్శకుడు ఓం రౌత్ డైలాగుల మార్పుకు శ్రీకారం చుట్టాడు.

ఇప్పటికే పేలవమైన వీఎఫ్ఎక్స్ ను సినీప్రియులు జీర్ణించుకోలేకపోయారు. ఆపై పలు డైలాగులు కూడా అభ్యంతరకరమైనవిగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రామాయణానికి భారతీయ ప్రజల మనసుల్లో ఎప్పటినుంచో ఓ గుర్తింపును పొందింది. రాముడి గుడి లేని ఊరు, రామ నామ స్మరణ లేని చోటు లేదని తెలుసిన విషయమే. గతంలో తీసిన రామాయణ సీరియల్, సినిమాలలో కూడా రాముడిని మర్యాద పురుషోత్తముడిగా చూపించారు. ఆపై రావణాసురుడిని గొప్ప శివ భక్తుడిగా తెరకెక్కించారు. ఇప్పుడు అదే రాముడి సినిమాలో అభ్యంతరకరమైన, పేలవమైన డైలాగులు ఉండటంతో పాటు, రావణాసురున్ని పాతాల లోకాధిపతిగా చూపెట్టడంపై సినీ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విమర్శలకు గురవుతున్న డైలాగులను మార్చుతున్నట్లు చెప్పారు డైరెక్టర్ ఓం రౌత్. ఇవి రానున్న వారం నుంచి ధియేటర్లలో మార్పును చూడొచ్చని అన్నారు. ఇందుకుగాను చిత్రబృందం ఓ ప్రకటనను విడుదల చేసింది. "ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన పొందుతొంది. అన్ని వయసుల వారిని అలరిస్తోంది. అయితే ప్రేక్షకుల కొరిక మేరకు కొన్ని డైలాగులను మార్పుచేయడానికి మేము నిర్ణయించుకున్నాము." అని తెలిపారు.

ఆదిపురుష్ కు మాటలు రాసిన మనోజ్ ముంతాషిర్ శుక్లా ట్విట్టర్ లో ట్రోల్స్ పై స్పందించాడు. "నేను ఆదిపురుష్ లో 4000 పంక్తులు రాసాను. కొన్ని డైలాగులు 5 లైన్లు ఉన్నాయి. మిగిలిన డైలాగులు శ్రీరామున్ని, మాతా సీతను కీర్తించేవిగా ఉన్నాయి. వాటికి నేను ఎటువంటి ప్రశంసలు అందుకోలేదు. అయినను... ప్రేక్షకుల అనుభూతి కంటే ఏమీ గొప్పది కాదు. నా డైలాగులకు అనుకూలంగా లెక్కలేనన్ని వివరణలు ఇవ్వగలను, కానీ ఇవి మీ బాధను తగ్గించలేవు. మిమ్మల్ని బాధపెట్టిన డైలాగులను రివైజ్ చేయాలని నేనూ, సినీ దర్శకులు, నిర్మాత నిర్ణయించుకున్నాము. వచ్చేవారం డైలాగుల మార్పును సినిమాలో గమనించవచ్చు" అని అన్నారు.





Tags

Read MoreRead Less
Next Story