Malaika Arora : మళ్లీ ప్రేమలో పడ్డాను : మలైకా అరోరా

Malaika Arora : మళ్లీ ప్రేమలో పడ్డాను : మలైకా అరోరా
X

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే ఆమె తండ్రి మరణించారు. అనంతరం జరిగిన పరిణామాలతో మలైకా పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె తండ్రి చనిపోయినప్పు డు ఈమె మాజీ భరత్ అర్బాజ్ ఖాన్, బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ అక్కడికి రావడంతో ఈమెపై వార్తలు గుప్పుమన్నాయి. 2018లో భర్త నుంచి విడిపో యిన తర్వాత అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉంది మలైకా. వీరి రిలేషన్ పై కొన్ని పుకార్లు రావడంతో వాటిమీద ఇద్దరూ క్లారిటీ కూడా ఇచ్చారు. తామిద్దరం విడిపోయామని, ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నట్టు చెప్పు కొచ్చింది ఈ బ్యూటీ. తాజాగా ఈమె మరోసారి ప్రేమలో పడ్డట్టు తెలు స్తోంది. 'మనల్ని కాదనుకొని వెళ్లిపోయిన వారి కోసం ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నన్ను ప్రేమించే వారిని ప్రేమించడంలో నేను బిజీగా ఉన్నాను. అందుకే నన్ను ఇష్టపడే వారితో ప్రేమలో పడ్డాను' అని ఓ ఫోటోను షేర్ చేసింది.

Tags

Next Story