Malaika Arora : ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న మలైకా బ్లాక్ షో

బాలీవుడ్ భామ మలైకా అరోరా అందాల ఆరబోతతో యూత్ ను అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. యాభై ఏండ్ల వయస్సులో ఉన్న ఈ అమ్మడి అందచందాలకు యూత్ ఫిదా అయిపోతూ ఉంటారు. తెలుగులో గబ్బర్ సింగ్ చిత్రంలో ఐటమ్ సాంగ్ తో ఫ్యాన్ ను అలరించింది. 25 ఏళ్ల వయసులో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ పెళ్లాడింది. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. దాదాపు 20 ఏళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత మలైకా తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైనా అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది. ప్రస్తుతం సింగిల్ గానే తన జీవితాన్ని లీడ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మలైకా తన ఫొటో షూట్లతో నెటిజెన్లను మెస్మరైజ్ చేస్తుంది. ఇటీవల మలైకా వరుస ఫోటోషూట్లు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. మలైకా తాజాగా ఆల్ బ్లాక్ కలర్ డిజైనర్ గౌన్ ధరించి అదిరిపోయే ఫోజులివ్వగా, ఆ ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఈ యూనిక్ డిజైనర్ లుక్ కోసం 50 ఏళ్ల మలైకా ఎంపిక చేసుకున్న జువెలరీ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ వయసులోను మైలకా అందచందాలకు యూత్ ఫిదా అయిపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com