Malayalam Actor : మలయాళ నటుడు ఆకస్మిక మృతి...

మలయాళ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నవాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మూవీ షూటింగ్ కోసం ఓ హోటల్ లో బస చేసిన ఆయన శవమై కనిపించారు. ఐతే నిద్ర లోనే హార్ట్ ఎటాక్ వచ్చి ఉండొచ్చని మూవీ యూనిట్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
51 సంవత్సరాల కళాభవన్.. చొట్టా నిక్కరలోని ఓ ప్రముఖ హోటల్ లో బస చేశారు. అయితే అపస్మారక స్థితిలో ఆయన కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించింది చిత్ర బృందం. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గుండెపోటుతో నటుడు కళాభవన్ మృతిచెందినట్లు చెబుతున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక కళాభవన్ ఆకస్మిక మృతితో ఇండస్ట్రీ పెద్దలు సంతాపం తెలుపుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com