Manchu Family : రంగారెడ్డి కలెక్టరేట్ లో మంచు ఫ్యామిలీ పంచాయితీ

Manchu Family : రంగారెడ్డి కలెక్టరేట్ లో మంచు ఫ్యామిలీ పంచాయితీ
X

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ప్రముఖ తెలుగు సినీ నటులు, నిర్మాత మంచు మోహన్ బాబు ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ ల పంచాయతీ రోజు రోజుకు చిలికి చిలికి గాలివానలా మారుతోంది. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మోహన్ బాబు ఇచ్చిన పిర్యాదు లో భాగంగా మంచు మనోజ్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ను కలిసి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా పూర్తి ఆస్తి పత్రాలతో తదుపరి విచారణకు రావాలిసిందిగా ఆదేశించడంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తండ్రి, కొడుకులు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ కుమార్ లు వివిధ పత్రాలతో కొంగర కాలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. మంచు మోహన్ బాబు మనోజ్ కుమార్ లు కలెక్టర్ ముందు హాజరు కాగా సుమారు రెండు గంటల పాటు మెజిస్ట్రేట్ విచారణ సాగింది. మెజిస్ట్రేట్ ఎదుట మంచు మనోజ్, మోహన్ బాబు పరస్పరం దూసించుకున్నట్లు సమాచారం. కొద్ది సేపటి వరకు ఇద్దరి మధ్య వాగ్వివాదం చెలరేగిందని తెలిసింది. తండ్రి మోహన్ బాబు కాళ్ళు మొక్కేందుకు మనోజ్ ప్రయత్నం చేయగా మోహన్ బాబు తిరష్కరించినట్లు తెలిసింది. తండ్రి తిరస్కారంతో మనోజ్ ఉద్వేగానికి గురైనట్లు కనిపిం చింది. ఆస్తి వివాదానికి సంబంధించిన వివరాలు పత్రాలు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ కు అందజేసి మీడియా తో మాట్లాడకుండానే కలెక్టర్ కార్యాలయం నుండి మోహన్ బాబు, మనోజ్ కుమార్ లు వెళ్ళిపోయారు. వచ్చే వారం మరోసారి మెజిస్ట్రేట్ ఎదుట విచారణ హాజరు కావాలని మెజిస్ట్రేట్ ఆదేశించినట్లు సమాచారం.

Tags

Next Story