Manchu Family : మంచు ఫ్యామిలీలో మంటలు..లక్ష్మీప్రసన్న ఏం చేయబోతున్నారు?

టాలీవుడ్ సీనియర్ నటుడు, క్రమశిక్షణ పేరుతో ఒకప్పుడు ఇండస్ట్రీని గ్రిప్ లో ఉంచుకున్న మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు రచ్చరచ్చగా మారాయి. ఓవైపు మంచు మనోజ్ ఫామ్ హౌస్ వద్ద భారీగా బౌన్సర్లు మోహరించారు. మరోవైపు మంచు విష్ణు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగారు. ఇంకోవైపు మంచు మనోజ్‌తో సోదరి మంచు లక్ష్మీప్రసన్న భేటీ అయినట్లు తెలుస్తోంది. మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవేంటి.. మనోజ్ ఇంటికి భారీగా బౌన్సర్లు ఎందుకొచ్చారు.. ఆ ఇంటి ఆడపడుచు మంచు లక్ష్మి ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
మంచు ఫ్యామిలీలో గొడవ వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. మోహన్ బాబు తనను కొట్టాడని కొడుకు మంచు మనోజ్ చెబుతున్నారు. గాయాలతో బంజారాహిల్స్ హాస్పిటల్ కు వచ్చారు. మెడకు పట్టీతో ఉన్న మంచు మనోజ్ నడవలేని స్థితిలో భార్యను పట్టుకుని కుంటుతూ హాస్పిటల్ కు వచ్చాడు. మనోజ్ ను ఆ స్థితిలో చూసిన వాళ్లంతా తీవ్రంగా కొట్టారని అభిప్రాయపడుతున్నారు.
నిన్న ఉదయం నుంచి ఈ రచ్చ సాగుతుండగా నిన్న సాయంత్రం హీరో మోహన్ బాబు చేసిన ట్వీట్ మరింత చర్చగా మారింది. కోరికలే గుర్రాలతే సినిమాను గుర్తు చేస్తూ పోస్ట్ చేశారు మోహన్ బాబు. దీంతో మనోజ్ గురించే ఈ ట్వీట్ చేశారనే టాక్ వస్తోంది. ఆస్తుల కోసమే గొడవ జరిగిందని ప్రచారం సాగుతుండగా.. మనోజ్ కు ఆశ ఎక్కువైందనే అర్ధం వచ్చేలా మోహన్ బాబు ట్వీట్ చేశారని అంటున్నారు. మంచు ఫ్యామిలీ గొడవ ఏ మలుపు తిరుగుతుందన్నదానిపై చర్చ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com