Manchu Vishnu : తిరుపతిలో స్టూడియో పెడతా : మంచు విష్ణు

Manchu Vishnu : సినీ ఇండస్ట్రీ సమస్యల పైన చాలా సేపు ఏపీ సీఎం జగన్ తో చర్చించానని అన్నారు 'మా' అధ్యక్షుడు విష్ణు.. కానీ ఇప్పుడే ఆ విషయాలను బయటపెట్టనని అన్నారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వచ్చిన మంచు విష్ణు.. జగన్ తో కలిసి భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే మేమూ అక్కడే ఉంటామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమకు రెండు కళ్లు అని అన్నారు. విశాఖలో తమకి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఫిల్మ్ ఛాంబర్‌తో కలిసి మాట్లాడి ఈ విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇటీవల సీఎం జగన్ తో చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు భేటి అయిన సంగతి తెలిసిందే.. అయితే ఈ సమావేశానికి తన నాన్నగారితో పాటు, మరో ఇద్దరు ముగ్గురు హీరోలకి కూడా ఆహ్వానం పంపారుని విష్ణు అన్నారు. అటు తిరుపతిలో తాను సినిమా స్టూడియో పెడతానని విష్ణు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com