Mani Sharma : కేసీఆర్ వివాదంపై స్పందించిన మణిశర్మ

Mani Sharma : కేసీఆర్ వివాదంపై స్పందించిన మణిశర్మ

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అందరి ఫేవరేటే అని అన్నారు ప్రముఖ సంగీతం దర్శకుడు మణిశర్మ(Manisharma). తాజాగా తన మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన పాట వివాదంపై క్లారిటీ ఇస్తూ పైవిదంగా కామెంట్ చేశారు మణిశర్మ. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మణిశర్మ సంగీతం అందిస్తున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఉస్తాద్ హీరో రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో డబుల్ ఇస్మార్ట్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఆగస్టు 15న థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమా నుండి తాజాగా ‘మార్ ముంత చోడ్ చింత’ అనే మాస్ పాటను విడుదల చేశారు మేకర్స్. అయితే.. ఈ పాటలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన ‘ఎం జేద్దాం అంటావ్ మరి’ అనే ఫేమస్ డైలాగ్ ను ఆయన వాయిస్ లోనే వాడారు.

Tags

Next Story