Manu Bhaker : టీవీలో సచిన్ ఆడే క్రికెట్‌ను చూస్తూ పెరిగా : మను బాకర్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను ఒలింపిక్ పతకాల విజేత మను బాకర్ కలిసింది. కుటుంబంతో కలిసివెళ్లిన ఆమె తన పతకాలను సచిన్‌కు చూపించింది. ఈసందర్భంగా మను బాకర్ మాట్లాడుతూ.. ‘‘నేను ఆయనను కలిసే ముందు మాట్లాడా. అదో ప్రత్యేకమైన సంభాషణ. భవిష్యత్తు సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చక్కగా వివరించారు. కష్టాలను ఎదిరించి ముందుకుసాగాలని సూచించారు. క్రికెట్ దిగ్గజంతో మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నా. టీవీలో సచిన్ ఆడే క్రికెట్‌ను చూస్తూ పెరిగా. నేను చిన్నమ్మాయిగా ఉన్నప్పుడు సచిన్ మైదానంలో, ఆవల ఎక్కడికి వెళ్లినా టీవీలో వస్తే తప్పకుండా చూసేదానిని. ఆయన్ను కలవడం అద్భుతంగా అనిపిస్తోంది’’ అని మను బాకర్ వెల్లడించింది. కాగా ఒలింపిక్స్‌లో పతకాలను సాధించిన షూటర్లను నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా శనివారం సత్కరించింది
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com