Tamannaah : పాలరాతి శిల్పం.. మిడ్డీ డ్రెస్ లో క్లాసీ లుక్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు తమన్నా భాటియా. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనదైన గుర్తింపు, మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఎంతో మంది టాప్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ మిల్క్ బ్యూటీ. వరుస విజయాలతో స్టార్ డమ్ తోనే బాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది. అక్కడ కూడా తన అందం, అభిన నయంతో నార్త్ ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఓవైపు హీరోయిన్ గా నటిస్తూనే.. స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తోంది. రీసెంట్ గా రజినీ కాంత్ జైలర్ లో కావాలయ్యా పాటతో ఓ ఊపు ఊపేసింది మరాఠా బ్యూటీ. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ స్త్రీ 2లోని ఆజ్ కీ రాత్ సాంగ్ తో కుర్రవాళ్లకు చెమటలు పట్టించింది. అయితే కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో తమన్నా చేసే సందడి వేరే లెవెల్. ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటోంది. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 19 ఏండ్లు అవుతున్నా తమ గ్లామర్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. తాజాగా మరో బ్యూటి ఫుల్ పిక్స్ తో తళుక్కుమంది అమ్మడు. వైట్ కలర్ మిడ్డీ డ్రెస్ లో క్లాసీలుక్ లో ఉన్న ఫొటోలు ఇన్స్టాలో షేర్చేసింది. రకరకాల పోజులను పోస్ట్ చేసిన తమన్నా.. తెల్ల పావురాల ఎమోజీ లను క్యాప్షన్ గా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్.. నెట్టింట వైరల్ గా మారాయి. సో షైనీ.. పాలరాతి శిల్పంలా ఉన్నారని, నిజంగా మిల్కీ బ్యూటీనే అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం అమ్మడు తెలుగులో ఓదెల 2 మూవీ.. అటు బాలీవుడ్ లో డార్లింగ్ పార్ట్ నర్స్ తో త్వర లోనే సందడి చేయనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com